- సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం
కోదాడ, వెలుగు : ఇంటర్‌లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన. బి. లక్ష్య (16) కోదాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల ఫలితాలు వెలువడగా రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది.
దీంతో సప్లిమెంటరీ ఫీజు కట్టేందుకు శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులు కోదాడకు వచ్చి కాలేజీలో వదిలి వెళ్లారు. తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత కాలేజీలోని పై అంతస్తులోని ఓ గదికి చేరుకున్న లక్ష్య చున్నీతో ఉరి వేసుకుంది. కాలేజీ పక్కనే ఇంట్లో ఉన్న వారు గమనించి సిబ్బందికి చెప్పడంతో వారు లక్ష్యను ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయింది. స్టూడెంట్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

